Parliament Mansoon session: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న ‘పెగాసస్‌’

దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘పెగాసస్‌’ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం కూడా ఉభయసభల్లో

Published : 23 Jul 2021 11:37 IST

దిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘పెగాసస్‌’ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో 15 నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది. 

ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. విపక్షాల నినాదాల నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కరోనా వేళ ఇలాంటి నిరసనలు తగవని, సభా కార్యకలాపాలు సజావుగా సాగనివ్వాలని స్పీకర్ వారిని కోరారు. అయినప్పటికీ వారు వెనక్కితగ్గకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమాధానమిచ్చారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెగాసస్‌, ఇతర అంశాలపై విపక్ష ఎంపీల నిరసనలతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని