Pegasus Row: ప్రతిపక్ష నేతలతో రాహుల్‌గాంధీ భేటీ

పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఈ భేటీ జరుగుతోంది

Updated : 28 Jul 2021 14:59 IST

దిల్లీ: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేశ్‌లతో పాటు శివసేన, సీపీఐ, సీపీఎం, రాష్ట్రీయ జనతాదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెగాసస్‌తో పాటు సాగు చట్టాలు, కరోనా వంటి అంశాలకు సంబంధించి పార్లమెంట్‌లో భవిష్యత్తు కార్యాచరణపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ నుంచి పెగాసస్‌ వ్యవహారం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై విపక్ష నేతలు ఆందోళనలు జరుపుతుండటంతో ఉభయ సభల్లో ఎటువంటి చర్చలు సాగడం లేదు. దీంతో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో చర్చకు ఆసక్తి చూపకపోగా.. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదని మోదీ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని