భారత్‌లో ఘటనలపై ఐరాస జోక్యం అనవసరం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై ఐరాస సమన్వయకర్త స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది..............

Published : 06 Oct 2020 09:47 IST

హాథ్రస్‌ ఘటనపై ఐరాస స్పందించడం పట్ల భారత్‌ అభ్యంతరం

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై ఐరాస సమన్వయకర్త స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై ఓ బయటి సంస్థ వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికింది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు లభిస్తాయని గుర్తుచేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేకూరుతుందని తెలిపింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌, బలరామ్‌పుర్‌ ఘటనలు సమాజంలో అట్టడుగున ఉన్న బలహీన వర్గాల మహిళలు, బాలికలకు రక్షణ కొరవడిన అంశాన్ని తెలియజేస్తోందని భారత్‌లోని ఐరాస సమన్వయకర్త పేర్కొన్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సామాజిక భరోసా, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల రక్షణకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బలహీనవర్గాల వారి విషయంలో భద్రత సూచీలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా విదేశాంగ శాఖ స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని