టీకాతో 8-10 నెలల వరకు రక్షణ

కొవిడ్-19 టీకాలు ఎనిమిది నుంచి 10 నెలల పాటు వైరస్‌ నుంచి రక్షణ ఇవ్వగలవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.

Published : 21 Mar 2021 02:01 IST

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

దిల్లీ: కొవిడ్-19 టీకాలు ఎనిమిది నుంచి 10 నెలల పాటు వైరస్‌ నుంచి రక్షణ ఇవ్వగలవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నవారిలో తీవ్రస్థాయిలో దుష్ప్రభావాలు ఎదురుకాలేదని వెల్లడించారు.

‘కొవిడ్ టీకాలు ఎనిమిది నుంచి 10 నెలల వరకు లేక ఇంకా ఎక్కువ కాలం రక్షణ ఇవ్వగలవు. మహమ్మారి సమసిపోయిందని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే మరోసారి వైరస్ విజృంభిస్తోంది. మిగతా కారణాలు ఏవైనప్పటికీ..ఇదే ప్రధాన కారణం. మరికొంతకాలం అత్యవసరం కానీ ప్రయాణాలను తగ్గించాలి’ అని ఐపీఎస్‌ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులేరియా సూచించారు. 

ఇదే కార్యక్రమానికి హాజరైన నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడమే తాజా ఉద్ధృతికి కారణమన్నారు. టీకాల లభ్యతను అనుసరించే ప్రాధాన్య వర్గాలను విభజించామని తెలిపారు. కాగా, దేశంలో రెండు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు నాలుగు కోట్ల పైచిలుకు మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని