చరిత్ర సృష్టించగలరు.. భవిష్యత్‌ నిర్మించగలరు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా అతివలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రంగంలో తనదైన ముద్రవేస్తూ దేశ అభివృద్ధి

Updated : 13 May 2022 17:10 IST

 అతివలకు రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా అతివలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రంగంలో తనదైన ముద్రవేస్తూ దేశ అభివృద్ధి పథంలో పాలుపంచుకుంటున్న నారీమణులకు అభినందనలు తెలియజేశారు. 

మహిళలు చరిత్ర సృష్టించగలరు.. అందమైన భవిష్యత్తును నిర్మించగలరు. మిమ్మల్ని అడ్డుకొనే అవకాశం అడ్డుకొనే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు-  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.

మహిళా వైద్యులు, న్యాయవాదులు, పైలట్లు, పారిశ్రామికవేత్తలు, సైనికులు, టీచర్లు, రచయితలు, జర్నలిస్టులు, క్రీడాకారిణిలు.. ఇలా పలు రంగాల్లో మహిళలు ఎంత ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తే ప్రపంచం అంత అందంగా, శక్తిమంతంగా కన్పిస్తుంది - కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా

ఆమె(HER) లేనిదే నాయకుడు(HERO) లేడు. కరోనా మహమ్మారి సమయంలో నిస్వార్థమైన నారీశక్తి గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ మహిళా దినోత్సవాన అలాంటి లక్షల మంది మహిళా ఆరోగ్య సిబ్బందికి సెల్యూట్‌ - కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధైర్యం, శౌర్యం, అంకితభావానికి ప్రతీక అయిన నారీ శక్తికి వందనం. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. ఈ రోజు ఆత్మనిర్భర భారత్‌ కలను సాకారం చేయడంలో మన మాతృశక్తి కూడా కీలక పాత్ర పోషిస్తుండటం గర్వంగా ఉంది - కేంద్ర మంత్రి అమిత్ షా

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్న మహిళా శక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దేశ పునాదులను మరింత పటిష్ఠం చేస్తున్న నారీశక్తికి అభినందనలు - కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని