నిర్మాత విశాల్‌కు ఖర్చు తగ్గించాలని..!

కరోనా సంక్షోభం వల్ల అనేక మంది జీవితాలు తలకిందులయ్యాయి. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది. ఆరు నెలలుగా థియేటర్లు మూతపడి ఉండటంతో సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాతలు తీవ్ర సమ్యలు ఎదుర్కొంటున్నారు. పలువురు ఓటీటీ వేదికగా తమ చిత్రాల్ని విడుదల చేశారు....

Published : 06 Oct 2020 12:37 IST

రోబో శంకర్‌ ఏం చేశారంటే?

చెన్నై: కరోనా సంక్షోభం వల్ల అనేక మంది జీవితాలు తలకిందులయ్యాయి. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది. ఆరు నెలలుగా థియేటర్లు మూతపడి ఉండటంతో సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాతలు తీవ్ర సమ్యలు ఎదుర్కొంటున్నారు. పలువురు ఓటీటీ వేదికగా తమ చిత్రాల్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నటుడు రోబో శంకర్ నిర్మాతకు డబ్బులు ఆదా చేయడం కోసం తన వంతు ప్రయత్నం చేశారు. తమిళ కథానాయకుడు విశాల్‌ నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఎమ్‌.ఎస్‌. ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. దొంగతనం చుట్టూ సాగే సైబర్‌ క్రిమినల్‌ కథా చిత్రమిది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇందులో రోబో శంకర్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. కాగా ఆయన సెట్‌లో ఉండగా తీసిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో రోబో శంకర్‌ కేవలం ఖాకీ చొక్కా ధరించి, ఖాకీ ప్యాంటు లేకుండా ఉన్నారు. ఇలా ఎందుకు ఉన్నారని ఆయన్ను ప్రశ్నించగా.. ‘నేను నటించబోతున్నది క్లోజ్‌ అప్‌ షాట్‌. అందుకే కేవలం ఖాకీ చొక్కా ధరించా. దీని వల్ల నిర్మాతపై కొంత భారం తగ్గుతుంది’ అని చెప్పారు. కరోనా కాలంలో నిర్మాతల్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికంలో కొంత భాగాన్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని