Raviteja: అసుర.. ‘రావణాసుర’
ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రవితేజను పదితలల రావణుడిలా చూపించారు. ఆయన లాయర్ కోటు ధరించి.. ఓ చేత్తో రక్తంతో తడిసిన సుత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో ఉన్నారు. ‘‘హీరోలు అనే వాళ్లు ఉండరు’’ అంటూ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ ‘రావణాసుర’ కథేంటన్నది పూర్తిగా తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.