ఇమాన్యుయెల్‌ మనసు మంచిది: వర్ష

రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా, కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ కామెడీ షో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యింది. అయితే వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలయ్యింది. 

Published : 06 Dec 2020 02:21 IST

హైదరాబాద్‌: రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా, కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ కామెడీ షో ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. అయితే వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.

సుడిగాలి సుధీర్‌ ఎప్పటిలాగే తనదైన స్టైల్‌లో రాంప్రసాద్‌తో కలిసి వరుస పంచులతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడని వీడియో చూస్తే తెలుస్తోంది. స్కిట్ లో భాగంగా కెవ్వు కార్తీక్‌ రాయలసీమ యాసలో అలరించనున్నారు. కాగా, ఈ స్కిట్ కోసం వర్ష ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ స్టేజీపై ఇమాన్యుయెల్‌తో కలిసి నవ్వులు పూయించనున్నారు. అనంతరం ‘ఇమాన్యుయెల్ నీకు ఎలా నచ్చాడు వర్ష’ అని రోజా ప్రశ్నించారు. ఏదేమైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌ జోడీ చూడముచ్చటగా ఉందని చెప్పగా..  ‘కలర్‌లో ఏముంది మేడమ్‌, అతడి మనసు చాలా మంచిది’ అంటూ వర్ష చెప్పడం గమనార్హం. ఈ ఫన్‌, జోష్‌ఫుల్ ఎపిసోడ్‌ను వీక్షించాలంటే వచ్చే శుక్రవారం (డిసెంబర్‌ 11) ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసి ఎంజాయ్‌ చేయండి!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts