Updated : 20 Dec 2020 11:55 IST

నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌

కంగారుపడిన నటి.. బౌన్సర్ల సాయం

హైదరాబాద్‌: షూటింగ్‌, షాపింగ్‌మాల్స్‌ ప్రారంభోత్సవాల్లో భాగంగా తమ ప్రాంతానికి సినీ తారలు వస్తున్నారని తెలిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఉన్నాసరే వాటిని లెక్కచేయకుండా సెలబ్రిటీలను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వస్తుంటారు. అధిక సంఖ్యలో వచ్చిన అభిమానుల్ని చూసి కొన్నిసార్లు పలువురు తారలు కంగారుపడుతుంటారు. అలాంటి సమయంలోనే బౌన్సర్లు అండగా ఉండి వారిని రక్షిస్తుంటారు. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి పరిస్థితే.. ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఎదుర్కొన్నారు.

అశోక్‌ గల్లా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ తాజాగా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో నిధి పాల్గొన్నారు. అభిమాన నటి తమ ప్రాంతానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో షూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లారు. ఆమె వాహనాన్ని చుట్టిముట్టారు. నిధి అగర్వాల్‌ ఫొటోలు తీసుకునేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ‘నిధి మేడమ్‌’ అంటూ కేకలు వేశారు. దీంతో ఆమె.. అభిమానులకు నవ్వుతూ అభివాదం చేస్తూనే కొంచెం కంగారుగా కారు దగ్గరికి నడిచారు. అభిమానులు కూడా ఆమె వెంటే పరిగెత్తారు. ఆమె  దారికి అడ్డుపడిన కొంతమందరిని బౌన్సర్లు నిలువరించారు. అయితే, చీకటిపడినా కూడా అభిమానులు అక్కడే వేచి ఉండడంతో ఆమె వాహనం నుంచి బయటకు వచ్చి అందరికీ హాయ్‌ చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘సవ్యసాచి’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నటి నిధి అగర్వాల్‌ ‘మిస్టర్‌.మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాలతో గతేడాది వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘భూమి’, ‘ఈశ్వరన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో

బ్యాట్‌ పట్టిన సోనూ.. కన్నీళ్లు పెట్టిన అనిత


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని