కాజల్‌ పెళ్లి ఫొటోలు చూశారా..!

నటి కాజల్‌ అగర్వాల్‌ రాకుమారిగా సిద్ధమై.. పెద్దల సమక్షంలో తన కలల రాకుమారుడు గౌతమ్‌ కిచ్లును వరించింది. ‘మిత్రవింద’గా తెలుగు వారి హృదయాలను దోచుకున్న ఈ ముంబయి ముద్దుగుమ్మ తాజాగా తన సింగిల్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. గౌతమ్‌తో న్యూజర్నీని ప్రారంభించారు. అతి తక్కువమంది అతిథుల...

Updated : 31 Oct 2020 11:24 IST

నెట్టింట్లో వైరల్‌

హైదరాబాద్‌: నటి కాజల్‌ అగర్వాల్‌ రాకుమారిగా సిద్ధమై.. పెద్దల సమక్షంలో తన కలల రాకుమారుడు గౌతమ్‌ కిచ్లును వివాహమాడారు. ‘మిత్రవింద’గా తెలుగు వారి హృదయాలను దోచుకున్న ఈ ముంబయి ముద్దుగుమ్మ తాజాగా తన సింగిల్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. గౌతమ్‌తో న్యూజర్నీని ప్రారంభించారు. అతి తక్కువమంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాజల్‌ వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తమని ఆశీర్వాదించడానికి వచ్చిన అతిథుల్ని వధూవరులిద్దరూ నవ్వుతూ పలికరించి, అభివాదం చేశారు. వేదమంత్రాల సాక్షిగా చేతిలో చేయి వేసుకుని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. అనంతరం అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నూతన జంటకు నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరోవైపు ముహూర్తానికి ముందు కాజల్‌.. పెళ్లికుమార్తెగా సిద్ధమవుతోన్న ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘తుపానుకు ముందు ఉండే నిశ్శబ్దం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ ఫొటో చూసిన సమంత, కీర్తి, తమన్నా, లక్ష్మిమంచు, నీరజా కోనా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనూ సూద్‌, అమలాపాల్‌తోపాటు మరికొంతమంది సినీ తారలు కాజల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి కుమార్తెగా కాజల్‌ చాలా అందంగా ఉందని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

ఇదీ చదవండి..
‘చందమామ’ పెళ్లి ‘తార’లు వెళ్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని