‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది.
ఇంటర్నెట్‌డెస్క్: 1972-73 ప్రాంతంలో మండలి కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆయన ఆధ్వర్యంలో సినిమా నటులందరూ సహకరించారు. ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చారు. నాటికలు, నాట్యాలు, మిమిక్రీలు, సంగీతం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తెనాలి తదితర పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాట కచేరి, రాజసులోచన నాట్యం, వేణుమాధవ్ మిమిక్రీలతో పాటు, నటీనటులు ఒక్కో నాటికలో నటించారు.
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. కృష్ణ, విజయనిర్మల, రాధాకుమారి, లీలారాణి, చంద్రమోహన్, సాక్షి రంగారావు, గుమ్మడి, జగ్గారావు, రావికొండలరావు తదితరులు నటులు ఆ నాటికలో వివిధ పాత్రలు పోషించారు. రాజమండ్రిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారీ స్టేజ్ కట్టారు. నాటకం ప్రదర్శిస్తుండగా విపరీతమైన గాలి రాగా, పైన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టార్ఫాలిన్ కప్పు లేచిపోయింది. చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైన వాన తీవ్రమైంది. ఇంతలో హీరో కృష్ణ వచ్చి, ‘మీరంతా చూస్తామంటే మేము ఈ వానలోనే నాటిక ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. ప్రేక్షకులు ‘చూస్తాం.. చూస్తాం..’ అని అన్నారు.
కుర్చీలు ఎత్తి తలపై పెట్టుకుని నిలబడి చూడసాగారు. ఒక పక్క వాన చప్పుడు హోరుమంటుంటే మరోపక్క లైట్లమీద నీరు పడి టప్‌టప్‌మని బల్బులు పేలిపోతున్నాయి. తడిసిన మైకులు మూగబోయాయి. వాన మరింత తీవ్రమైంది. అంతే! ప్రేక్షకులు పరిగెత్తారు. చేసేది లేక కృష్ణతో సహా మిగిలిన నటులు కూడా స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిపోయారు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన గతంలో కొన్ని సినిమాలను చేయలేకపోయారు. అవి బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంగతులు మీకోసం.. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్ అని సంబోధిస్తుంటారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ