Ghani: అందాల ‘గని’

‘నీ పదునేంటో.. పవర్‌ ఏంటో, పంచుల్లో కనిపించనీ’ అంటూ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగిన గనీకి మరింత ఉత్సాహాన్ని నూరిపోస్తోంది తమన్నా. ఆ కథేమిటో తెలియాలంటే ‘గని’ సినిమా చూడాల్సిందే. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా

Updated : 25 Mar 2022 14:50 IST

నీ పదునేంటో.. పవర్‌ ఏంటో, పంచుల్లో కనిపించనీ’ అంటూ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగిన గనీకి మరింత ఉత్సాహాన్ని నూరిపోస్తోంది తమన్నా. ఆ కథేమిటో తెలియాలంటే ‘గని’ సినిమా చూడాల్సిందే. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక తమన్నా ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. కొడితే... అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.  ‘‘సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే గీతమిది. ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. తమన్నా అందచందాలు ఈ పాటకి అదనపు ఆకర్షణ. వరుణ్‌తేజ్‌ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమై నటించారు. సిక్స్‌ ప్యాక్‌ దేహంతో కనిపిస్తూ, బాక్సర్‌గా ఆయన ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తార’’ని తెలిపాయి చిత్రవర్గాలు. జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం: తమన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని