క్యాబేజీ డ్రెస్‌లో ‘కెవ్వుకేక’ భామ

హీరోయిన్లు అందరిని దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఫొటోషూట్లు చేస్తుంటారు. అది బాలీవుడ్‌లో అయితే.. వినూత్నం కాస్త వింతకు దారితీస్తుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ ఆకులు అడ్డుపెట్టుకొని చేసిన ఫొటోషూట్‌ గుర్తుందిగా..

Updated : 31 Dec 2020 16:30 IST

ముంబయి: హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఫొటోషూట్లు చేస్తుంటారు. అది బాలీవుడ్‌లో అయితే.. వినూత్నం కాస్త వింతకు దారితీస్తుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ ఆకులు అడ్డుపెట్టుకొని చేసిన ఫొటోషూట్‌ గుర్తుందిగా.. మరీ అంతలా కాకున్నా.. అలాంటి ప్రయత్నమే చేసింది మరో భామ. ‘గబ్బర్‌సింగ్‌’లో వపర్‌స్టార్‌తో కలిసి కెవ్వుకేక అంటూ చిందేసిన బాలీవుడ్‌ నటి మలైకా అరోడా గుర్తుందిగా. ఆమె చేసిన ఫొటోషూట్‌లోని ఒక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయింది. ఆ ఫొటోను ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు ఆమెపై జోకులు వేసుకుంటున్నారు.

ఫొటోషూట్‌లో భాగంగా మలైకా ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ఉష్ణమండల స్వర్గం’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. అందులో ఆమె ధరించిన ఆకుపచ్చ దుస్తుల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ‘గ్రీన్‌ క్యాబేజీ’ అంటూ ఒకరు స్పందించగా.. కాదుకాదు.. ‘గోబీ డ్రెస్‌’ అంటూ మరొకరు స్పందిస్తున్నారు. ఇంకొంతమందేమో.. గత ఏడాది డబ్బూ రత్నాని తీసిన క్యాలండర్‌ ఫొటో షూట్‌కు ఈ ఫొటో ఏమాత్రం తీసిపోదని అంటూ ఉందని అప్పటి కియారా ఫొటోను గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. తన ప్రియుడు అర్జున్‌కపూర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లినట్లు వస్తున్న వార్తలకు ఆమె చేసిన తాజా పోస్టు మరింత బలం చేకూర్చింది.

 మలైకా టాలీవుడ్‌లోనూ కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌కు చిందేసింది. గబ్బర్‌సింగ్‌లో ‘కెవ్వుకేక’, అతిథి సినిమాలో ‘రాత్రయినా నాకూ ఓకే.. పగలైతే డబలోకే’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. బాలీవుడ్‌లో ఓం శాంతి ఓం, హౌస్‌ఫుల్‌, దబాంగ్‌ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఆమె బుల్లితెరకే పరిమితమైంది.

ఇదీ చదవండి..

‘వావ్‌’ ఓజా.. జ్వాల.. ద్రోణవల్లి హారిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని