కాజల్‌ పెళ్లి కోసం ఎంతోకాలంగా వెయిటింగ్‌ 

మరికొన్ని రోజుల్లో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లును మనువాడనున్నారు. అక్టోబరు 29న హల్దీ (పసుపు కొట్టడం), మెహెందీ వేడుకల్ని నిర్వహించబోతున్నామని కాజల్‌ సోదరి, నటి నిషా అగర్వాల్‌ మీడియాకు తెలిపారు.....

Updated : 27 Oct 2020 18:37 IST

ఇంట్లోనే హల్దీ, మెహందీ వేడుకలు: నిషా అగర్వాల్‌ 

ముంబయి: మరికొన్ని రోజుల్లో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లును మనువాడనున్నారు. అక్టోబరు 29న హల్దీ (పసుపు కొట్టడం), మెహెందీ వేడుకల్ని నిర్వహించబోతున్నామని కాజల్‌ సోదరి, నటి నిషా అగర్వాల్‌ మీడియాకు తెలిపారు. ఈ పెళ్లి కోసం తమ కుటుంబం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

‘కరోనా వైరస్‌ నేపథ్యంలో పెళ్లి వేడుకల్ని నిడారంబరంగా జరుపుతున్నాం. ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని పాటిస్తూ.. సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయం ప్రకారం హల్దీ, మెహెందీ వేడుకల్ని ఇంట్లోనే నిర్వహిస్తున్నాం. ఈ రెండు పెళ్లికి ముందు రోజు (అక్టోబరు 29) జరుగుతాయి. కాజల్‌ తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది.. మేమంతా చాలా ఉత్సుకతగా ఉన్నాం’.

‘ఇది మా కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్న సమయం. కాజల్‌ పెళ్లి కోసం మా తండ్రి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఇది మాకు ప్రత్యేకమైన రోజు. మరోపక్క కాజల్‌ వివాహం చేసుకుని, ఇంటి నుంచి వెళ్లిపోతుండటం మమ్మల్ని బాధిస్తోంది. ఇప్పుడు వీలైనంత సమయం అక్కతో గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో అందరూ పెళ్లి కుమార్తెతో మాట్లాడాలని, ఉండాలని అనుకుంటారు. కాబట్టి నాకు అక్కతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదు’ అని ఆమె అన్నారు.

వివాహం ఎక్కడ జరగబోతోందనే విషయాన్ని మాత్రం నిషా వెల్లడించలేదు. ‘కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరు కాబోతున్నారు. ఈ వివాహం ఎంతో ప్రత్యేకంగా జరగబోతోంది.. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పెళ్లి జరిగే రోజే సంగీత్‌ కూడా ఏర్పాటు చేశాం. పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ.. సంతోషం, ప్రేమను పంచుకోబోతున్నాం. గౌతమ్‌ గొప్ప వ్యక్తి. అతడ్ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. తమ ప్రేమ కథను కాజల్‌ స్వయంగా ఈ ప్రపంచానికి తెలుపుతుంది’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని