ఆర్మీ దుస్తుల్లో.. ఎవరబ్బా!

ఇక ఈ చిత్రం నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించింది.

Published : 12 Dec 2020 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంకా చోప్రా. తనకు తండ్రి అశోక్‌ చోప్రా అంటే ఆమెకు ఎంతో అభిమానమన్న సంగతి ఈ మాజీ మిస్‌ వరల్డ్‌ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఓ చిన్నారి ఆర్మీ యూనిఫారంను ధరించి ఉన్న చిత్రాన్ని తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అంతేకాదు, ‘లిటిల్‌ ప్రియాంక’ అంటూ వ్యాఖ్యను కూడా జోడించారు. దీంతో ఆ చిన్నారి పిగ్గీ ఛాప్స్‌ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోయారు.

ఈ చిత్రం త్వరలో ప్రచురించనున్న తన పుస్తకంలోనిదని ప్రియాంక వివరించారు.  చిన్నప్పుడు ఆర్మీలో ఉన్నతాధికారి అయిన తండ్రి దుస్తుల్ని ధరించి ఇల్లంతా తిరిగేదాన్నని.. పెరిగి పెద్దయ్యాక ఆయన లాగానే కావాలనుకున్నానని ఆమె వెల్లడించారు.  ప్రియాంక చోప్రా జీవిత విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ బుక్స్‌ ఆవిష్కరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని