నిద్రపోతున్న నివేదాకు మేకప్‌.. బిగ్‌బీ ఫన్నీ పోస్ట్‌

మంగళవారం మగవాళ్లకు సెలవా.? అన్నట్లే ఉంది.. సినీ సెలబ్రిటీల పరిస్థితి. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్లే హవా చూపించారు. ఇటు టాలీవుడ్‌.. అటు బాలీవుడ్‌లో హీరోలెవ్వరూ ఈరోజు యాక్టీయ్‌గా కనిపించలేదు. హీరోలంతా సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయారేమో.?

Updated : 16 Dec 2020 15:48 IST

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

* సిగ్గుపడే కళ ఇదే అంటూ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* ఆహారం నన్ను సంతోషంగా ఉంచుతుంది. ‘ఫ్రెంచ్‌ గ్యాస్ట్రానమీ’ని మీరూ ప్రయత్నించండి అంటూ హీరో విజయ్‌ దేవరకొండ ఓ పోస్టు చేశాడు.

* నిద్రలో ఉన్న తనకు తన ఫ్రెండ్‌ మేకప్‌ వేస్తున్న ఓ చిన్న వీడియోను హీరోయిన్ నివేదా పేతురాజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. నన్ను నిద్ర పోనివ్వండి అని రాసుకొచ్చింది. 

* మిస్‌ వరల్డ్‌ 2017 మానుషీ.. సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్నప్పటి ఫొటోలను ట్విటర్‌లో పంచుకుంది. అందులో ఆమె బికినీ ధరించి ఉంది.

* ప్రియాంకచోప్రా తన భర్త నిక్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 

* చిరుత హీరోయిన్‌ నేహాశర్మ షూటింగ్‌లో భాగంగా స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకొని స్క్రిప్ట్‌ చదువుతున్నప్పటి ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

* 2020లో కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఓ పోస్టు చేశారు.

* బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.


 













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని