Acharya: ‘ఆచార్య’ వేడుక

చిరంజీవి, రామ్‌ చరణ్‌ల ‘ఆచార్య’ హంగామా షురూ అవుతోంది. ఈ నెల 23న హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు  వేడుకని నిర్వహించనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న

Updated : 17 Apr 2022 08:23 IST

చిరంజీవి, రామ్‌ చరణ్‌ల ‘ఆచార్య’ హంగామా షురూ అవుతోంది. ఈ నెల 23న హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు  వేడుకని నిర్వహించనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌‘.. రామ్‌చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పకులు. ఈ నెల 18న ‘భలే భలే బంజారా..’ అంటూ సాగే పాటని కూడా విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వరకల్పనలోని ఈ గీతంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నృత్యాలతో చేయనున్న సందడి సినిమాకి ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని