Ajay Devgn: అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’ ఈసారైనా వచ్చేనా.. కొత్త రిలీజ్‌ డేట్‌పై ప్రచారం

అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ‘మైదాన్‌’ రిలీజ్‌పై నెట్టింట ప్రచారం జరుగుతోంది.

Published : 21 Jan 2024 17:41 IST

ముంబయి: విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు బాలివుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ (Ajay Devgn). ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఆయన నటించిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). అమిత్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే పలు సందర్భాల్లో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రిలీజ్‌ డేట్‌కు సంబంధించి తాజాగా నెట్టింట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈద్‌ కానుకగా ఏప్రిల్‌ నెలలో ఇది విడుదల కానుందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Sai pallavi: సాయిపల్లవి ఇంట శుభకార్యం.. పూజ నిశ్చితార్థం

భారత ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్‌’ను తీర్చిదిద్దారు. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అబ్దుల్‌ రహీమ్‌ సతీమణిగా ప్రియమణి కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మించారు. అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో నటించడం గర్వంగా ఉందని అజయ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనసుని హత్తుకునేలా అమిత్‌ శర్మ దీనిని తీర్చిదిద్దారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని