Sai pallavi: సాయిపల్లవి ఇంట శుభకార్యం.. ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌.. పూజ నిశ్చితార్థం

సాయిపల్లవి (Sai Pallavi) సోదరి పూజ (pooja kannan) వివాహం త్వరలో జరగనుంది. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

Updated : 22 Jan 2024 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్‌ (Pooja Kannan) వివాహం త్వరలో జరగనుంది. తన స్నేహితుడు వినీత్‌తో పూజ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయంటూ పూజ ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సాయిపల్లవి సోదరిగా పూజ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలే. కోలీవుడ్‌ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఇది విడుదలైంది. పూజ నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘వినీత్‌.. నా సన్‌షైన్‌.  ఇప్పటివరకూ నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైమ్.. ఇకపై నా జీవిత భాగస్వామి’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని