Alia Bhatt: మొదలైంది ‘జిగ్రా’ ప్రయాణం

‘‘నన్ను చూడు.. నువ్వు నా రాఖీ కట్టుకున్నావా? ఇప్పుడు మీరు నా రక్షణలో ఉన్నారు. నేను మీకు ఏమి జరగన్విను’’ అంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘జిగ్రా’ను ప్రకటించింది అలియా భట్‌.

Updated : 07 Oct 2023 13:51 IST

‘‘నన్ను చూడు.. నువ్వు నా రాఖీ కట్టుకున్నావా? ఇప్పుడు మీరు నా రక్షణలో ఉన్నారు. నేను మీకు ఏమి జరగన్విను’’ అంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘జిగ్రా’ను ప్రకటించింది అలియా భట్‌. ఆమె కథానాయికగా నటిస్తూ.. తన ప్రొడక్షన్స్‌పై కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. వాసన్‌ బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది చిత్రబృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ సెట్స్‌ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది అలియా. ‘మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం.మా మనసుకు దగ్గరైన ఈ సినిమాని మీ ముందుకు తీసుకువస్తున్నాము. వేచి ఉండండి’ అని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబరు 27న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని