pushpa 2: రామోజీ ఫిల్మ్‌సిటీలో పుష్ప 2 యాక్షన్‌ హంగామా

‘పుష్ప’లో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ చేసిన హంగామా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ‘పుష్ప 2’లోనూ అంతకుమించి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Updated : 30 Jan 2024 09:26 IST

‘పుష్ప’లో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ చేసిన హంగామా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ‘పుష్ప 2’లోనూ అంతకుమించి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని కీలక యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక తదితరులపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరో 200 రోజుల్లో రానుందంటూ సోమవారం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని