Avika Gor: భయపెట్టే.. చిన్నారి పెళ్లికూతురు

బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌భట్‌ కెరీర్‌లోనే ‘1920’ ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. 2008లో వచ్చిన ఈ సినిమాకి కొన  సాగింపుగా హారర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’లో అవికా గోర్‌ను

Updated : 24 Apr 2022 06:52 IST

బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌భట్‌ కెరీర్‌లోనే ‘1920’ ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. 2008లో వచ్చిన ఈ సినిమాకి కొన  సాగింపుగా హారర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’లో అవికా గోర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసినట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్న విక్రమ్‌భట్‌ ప్రకటించారు. ఆయన కుమార్తె కృష్ణ భట్‌ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత మహేశ్‌ భట్‌ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. 2012లో ఈ సిరీస్‌లో వచ్చిన ‘1920 ది ఈవిల్‌రిటర్న్స్‌’ కు మిశ్రవ స్పందన లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని