BholaaShankar: భోళా మానియా షురూ..

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు కథానాయకుడు చిరంజీవి. ఇప్పుడాయన ‘భోళా శంకర్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 03 Jun 2023 12:25 IST

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఇప్పుడాయన ‘భోళా శంకర్‌’ (BholaaShankar)తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 4న ‘భోళా మానియా’ పేరుతో తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను శుక్రవారం బయటకొదిలారు. అందులో చిరు మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో ఓ చేత్తో కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటూ.. మరో చేత్తో త్రిశూలం లాకెట్‌ ఉన్న కీచైన్‌ను తిప్పుతూ ఆసక్తికరంగా కనిపించారు. ‘‘భావోద్వేగాలతో నిండిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని