chiranjeevi: సాహస యాత్ర కోసం చెమటోడుస్తున్నారు

‘విశ్వంభర’ కోసం త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. సాహసాల ప్రయాణంలా సాగే ఆ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. జిమ్‌లో కసరత్తులతో చెమటోడుస్తున్నారు. మరింత ఫిట్‌గా కనిపించడం కోసమే ఇదంతా. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated : 02 Feb 2024 09:27 IST

‘విశ్వంభర’ కోసం త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. సాహసాల ప్రయాణంలా సాగే ఆ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. జిమ్‌లో కసరత్తులతో చెమటోడుస్తున్నారు. మరింత ఫిట్‌గా కనిపించడం కోసమే ఇదంతా. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. చిరు సరసన ఇందులో పలువురు కథానాయికలు ఆడిపాడనున్నట్టు సమాచారం.

మరో సినిమా స్క్రిప్ట్‌ సిద్ధం!: ఒకవైపు ‘విశ్వంభర’ కోసం సన్నద్ధమవుతూనే... మరోవైపు తదుపరి చిత్రం కోసం కథా చర్చల్నీ కొనసాగిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాణంలో రూపొందనున్న ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ ఇప్పటికే పక్కా అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ వివరాలు బయటికొచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి  హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నారన్ని సమాచారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని