Custody Trailer: ఆలస్యమైనా గెలిచేది నిజమే

‘‘ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’’ అంటున్నారు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘కస్టడీ’.

Updated : 06 May 2023 07:09 IST

‘‘ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’’ అంటున్నారు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘కస్టడీ’ (Custody). శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించారు. శరత్‌ కుమార్‌, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. చైతూ ఇందులో శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ‘‘నిజం గెలవడానికి లేటవుతుంది. కానీ, కచ్చితంగా గెలుస్తుంది’’ అంటూ ఆఖర్లో చైతన్య చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు