Dulquer Salmaan: రూ.100 కోట్లు వస్తేనే హిట్‌ అని ఎవరు చెప్పారు?: దుల్కర్‌ సల్మాన్‌

‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King Of Kotha) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దుల్కర్‌ పాల్గొన్నారు. బాక్సాఫీస్‌ నంబర్ గేమ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 23 Aug 2023 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సాఫీస్‌ నంబర్‌ గేమ్‌పై నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా రూ.100 కోట్లు సాధిస్తేనే హిట్‌ లేదా సూపర్‌హిట్‌.. లేకపోతే అది పరాజయం అందుకున్నట్లేనని ఎవరు చెప్పారు?. ఒక సినిమా భారీ వసూళ్లు రాబట్టకపోయినా.. అది అందుకున్న ప్రేమను తక్కువ చేయకూడదన్నారు

‘‘రూ.100 కోట్లు వస్తేనే సినిమా హిట్‌ లేదా సూపర్‌హిట్‌.. అంతకంటే తక్కువ వసూళ్లు వస్తే అది సూపర్‌హిట్‌ కాదంటారు. అసలు ఈ విషయాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది ప్రామాణికంగా ఎలా మారిందో తెలియదు. బాక్సాఫీస్‌ నంబర్‌ గేమ్‌ అనేది హాస్యాస్పదంగా ఉంది. అలాగే ఒక సినిమా మ్యాజిక్‌ నంబర్‌ను తాకనందున అది పొందిన ప్రేమను తక్కువగా చూడకూడదు. కొన్నిసార్లు చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు పెట్టుబడి కంటే మూడు రెట్లు ఎక్కువగా బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపిస్తాయి. అలాగే, కొన్నిసార్లు చిన్న హీరోలు తమ కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ అందుకోవచ్చు. అది కూడా విజయమే’’ అని ఆయన వివరించారు.

Akira: అకీరా సినీ ఎంట్రీపై విమర్శలు.. రేణూ దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

అనంతరం ఆయన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనడంపై మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా అది జరిగింది. ఓసారి విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’, నా ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ ప్రమోషన్స్‌ ఒకే లొకేషన్‌లో జరిగాయి. తను నా పోస్టర్‌ చూశారు. నేను తన సినిమా పోస్టర్‌ చూశా. అలా, మేమిద్దరం కలిసి ఒక ప్రమోషన్‌ వీడియో చేశాం’’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని