Ek Mini Katha: అమెజాన్‌లో ‘మినీ కథ’

చిత్రసీమపై కరోనా మరోమారు దెబ్బ కొట్టింది. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన పలు చిత్రాలు.. కొవిడ్‌ ఉద్ధృతి వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లు తిరిగి తెరచుకోవడాని...

Published : 17 May 2021 13:49 IST

చిత్రసీమపై కరోనా మరోమారు దెబ్బ కొట్టింది. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన పలు చిత్రాలు.. కొవిడ్‌ ఉద్ధృతి వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లు తిరిగి తెరచుకోవడాని మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అందుకే చిన్న సినిమాలు ఒకొక్కటిగా ఓటీటీ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’  ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడీ జాబితాలోకి ‘ఏక్‌ మినీ కథ’ చేరేందుకు సిద్ధమైంది. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కార్తీక్‌ రాపోలు దర్శకుడు. మేర్లపాక గాంధీ కథ అందించారు. గత నెల 30నే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా తీవ్రత వల్ల వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.  అమెజాన్‌ చిత్ర బృందంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిసింది. చిత్ర విడుదలపై ఈవారంలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని