EXPEND4BLES trailer: సిల్వెస్టర్ యాక్షన్ మేనియా
యాక్షన్ హీరోల్లో సిల్వెస్టర్ స్టాలోన్ కంటూ ప్రత్యేక అభిమానులున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏళ్ల తరబడి నటిస్తున్నా ఆయనకున్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఎక్సెపెండబుల్స్-4’ ట్రైలర్ విడుదలైంది.
యాక్షన్ హీరోల్లో సిల్వెస్టర్ స్టాలోన్ కంటూ ప్రత్యేక అభిమానులున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏళ్ల తరబడి నటిస్తున్నా ఆయనకున్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఎక్సెపెండబుల్స్-4’ ట్రైలర్ విడుదలైంది. స్కాట్ వాగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సరికొత్త హంగులతో, యాక్షన్ సన్నివేశాలతో దాదాపు దశాబ్ద కాలం తర్వాత అభిమానుల ముందుకు వచ్చింది. ‘కొన్ని సంబంధాలు విడిపోవడానికి దగ్గరవుతాయి, కొన్ని సంబంధాలు మాత్రం ఆ సంబంధాన్ని విస్తరింపజేయడానికి దగ్గరవుతాయి’ అంటూ మొదలయ్యే ఆ ట్రైలర్, సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తోంది. బృంద నాయకుడైన బార్ని రోస్ పాత్రలో సిల్వెస్టర్, ఖడ్గ వీరుడైన లీ క్రిస్ట్‌మస్ పాత్ర పోషిస్తున్న జాసన్ స్టతమ్‌తో కలిసి కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 22న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ