Hera Pheri 3: ఒకటే సీక్వెల్‌... స్క్రిప్టులు రెండు

బాలీవుడ్‌లో వినోదాలు పంచిన సిరీస్‌ల్లో ‘హెరాఫెరీ’ ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’కి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ఫిరోజ్‌ నడియాడ్‌వాలా.

Updated : 16 Dec 2022 09:12 IST

బాలీవుడ్‌లో వినోదాలు పంచిన సిరీస్‌ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’కి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ఫిరోజ్‌ నడియాడ్‌వాలా. ఈ చిత్రాల్లో గతంలో నటించిన అక్షయ్‌కుమార్‌ నటిస్తారా? లేక యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ సందడి చేస్తారా? అనే విషయంలో చిత్రబృందానికే స్పష్టత లేనట్లు తెలుస్తోంది. సినిమాని నిర్మించడం అయితే పక్కా కానీ హీరో ఎవరనే విషయంలో సందిగ్ధంలో పడ్డారట ఫిరోజ్‌. అందుకే అక్షయ్‌కు సరిపోయేలా ఓ స్క్రిప్ట్‌, కార్తీక్‌ ఆర్యన్‌ కోసం మరో స్క్రిప్ట్‌ సిద్ధం చేయించారట. ఈ సినిమా కోసం ఓ పక్క అక్షయ్‌తో మాట్లాడుతూనే మరో పక్క కార్తీక్‌ టీమ్‌తోనే చర్చలు జరుపుతున్నారట ఫిరోజ్‌. మరి చివరికి ఏ హీరోతో సినిమా సెట్స్‌పైకి వెళుతుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని