Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’ ఆడియో సాంగ్‌ లీక్‌.. దిల్‌రాజు సీరియస్‌

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సాంగ్‌ లీక్‌పై చిత్రబృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాత దిల్‌రాజు తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

Published : 17 Sep 2023 01:40 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) - శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్‌లైన్‌ వేదికగా లీకైంది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఇది వైరల్‌ మారింది. సాంగ్‌ లీక్‌ కావడంపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించారు. పాటను లీక్‌ చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పాటను షేర్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Neha Shetty: ‘టిల్లు స్క్వేర్‌’.. ఆ విషయంలో వాళ్లు నిరాశకు గురయ్యారు: నేహాశెట్టి

పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్‌ రెండు విభిన్నమైన లుక్స్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్‌ స్టిల్స్‌ అనధికారికంగా నెట్టింట విడుదలయ్యాయి. లీకులకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ మొదట్లో చిత్ర నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా పాట లీక్‌ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని