‘కరణ్‌ జోహార్‌ ఏడుస్తూనే ఉన్నాడు’

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మృతిపట్ల అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా ఈ విమర్శలతో కరణ్‌..

Updated : 09 Jul 2020 10:56 IST

వెల్లడించిన అగ్ర నిర్మాత సన్నిహితుడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మృతిపట్ల అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా ఈ విమర్శలతో కరణ్‌ తీవ్రంగా కలత చెందినట్లు అతడి సన్నిహితుడు వెల్లడించారు. బాలీవుడ్‌ హంగామాతో  కరణ్‌ మిత్రుడు మాట్లాడుతూ.. సుశాంత్‌ ఆత్మహత్య తరువాత ఎదుర్కొన్న విమర్శలతో కరణ్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ‘కరణ్‌ తీవ్రంగా కలత చెందాడు.  సుశాంత్‌తో ఎలాంటి సంబంధంలేని అనన్య పాండేకు కూడా విమర్శలు తప్పలేదు. సుశాంత్‌ ఆత్మహత్యకు పరిహారంగా నువ్వు కూడా బలవన్మరణానికి పాల్పడాలంటూ సామాజిక మాధ్యమాల్లో నిందించారు’ అని పేర్కొన్నాడు. మరి ఈ విమర్శలపై కరణ్‌ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండటమే ఉత్తమం అని అతడి లాయర్‌ సూచన మేరకే కరణ్‌ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అతడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. నేను ఏం తప్పు చేశానంటూ కుంగిపోతూ ఏడుస్తూనే ఉన్నాడు. అతడు విధికి బలైన వ్యక్తిలా అనిపిస్తున్నాడు’ అని అన్నాడు. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాలీవుడ్‌లో దుమారం రేపింది. ఇండస్ట్రీలో బంధుప్రీతి వల్లనే సుశాంత్‌ ఒత్తిడి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కరణ్‌ జోహార్‌, ఆలియా భట్‌, సోనాక్షి సిన్హా, సోనమ్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ పరిణామంతో కరణ్‌, అలియా, సోనమ్, కరీనా కపూర్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టింగులను పరిమితం చేశారు. సోనాక్షి తన ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేసింది. కరణ్‌, ఆలియా ఇస్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఒక్కసారిగా తగ్గిపోయారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని