పెద్ద విజయమిది

అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌ ప్రధాన పాత్రల్లో వెంకటేష్‌ త్రిపర్ణ తెరకెక్కించిన చిత్రం ‘రామ్‌ అసుర్‌’. చాందిని తమిళ్‌రాసన్‌, శెర్రి అగర్వాల్‌, షానీ సాల్‌మాన్‌ కీలక పాత్రలు పోషించారు.

Published : 05 Dec 2021 03:05 IST

భినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌ ప్రధాన పాత్రల్లో వెంకటేష్‌ త్రిపర్ణ తెరకెక్కించిన చిత్రం ‘రామ్‌ అసుర్‌’. చాందిని తమిళ్‌రాసన్‌, శెర్రి అగర్వాల్‌, షానీ సాల్‌మాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  అభినవ్‌ సర్ధార్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా పెద్ద విజయాన్ని అందించారు. నా సూరి పాత్రను ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం నేను హీరోగా చేసిన మరో సినిమా ‘మిస్టేక్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని