
Updated : 20 Jan 2022 07:14 IST
Khiladi: ఖిలాడి’.. ఫుల్ కిక్
సినీప్రియులకు ఫుల్ కిక్ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథా నాయకుడు రవితేజ. ఇప్పుడాయనతో రమేష్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని నాలుగో పాటని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ‘‘ఫుల్ కిక్’’ అంటూ సాగే ఈ గీతాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు.
Tags :