Tollywood: ‘హైవే’లో ఎవరు ఆ కిల్లర్‌?

ఆనంద్‌ దేవరకొండ హీరోగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘హైవే’. మానస కథానాయిక.  అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర  పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర

Updated : 07 Aug 2022 03:29 IST

నంద్‌ దేవరకొండ హీరోగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘హైవే’. మానస కథానాయిక.  అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర  పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర పోస్టర్‌ను  విడుదల చేశారు. ‘‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. ఆనంద్‌ ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు. ఆయన ప్రేయసిగా మానస నటించింది. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో.. ఒక సీరియల్‌ కిల్లర్‌ ‘డి’ అనే పేరుతో ప్రవేశిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’ అని చిత్ర వర్గాలు  తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని