Ram: రామోజీ ఫిల్మ్‌సిటీలో రామ్‌ సినిమా షురూ!

బోయపాటి శ్రీను, రామ్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి నుంచి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Updated : 07 Oct 2022 07:22 IST

బోయపాటి శ్రీను (Boyapati Srinu), రామ్‌ (Ram) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి నుంచి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా ఎంపిక చేసినట్టు దసరా సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘రామ్‌ ఎనర్జీకి తగ్గట్టు శక్తిమంతమైన పాత్రను బోయపాటి తీర్చిదిద్దారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టంట్‌ శివ నేతృత్వంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తాం’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని