హన్సిక పెళ్లి సందడి
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందిన హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తను ప్రేమించిన సోహైల్ కథూరియాని ఆదివారం రాత్రి పెళ్లాడింది.
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందిన హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తను ప్రేమించిన సోహైల్ కథూరియాని ఆదివారం రాత్రి పెళ్లాడింది. ఈ వేడుకకి రాజస్థాన్ జైపూర్‌లోని ముందోట రాజకోట, రాచభవనం వేదికలుగా మారాయి. డిసెంబరు 2న సూఫీ నైట్‌తో వివాహ వేడుకలు మొదలయ్యాయి. తర్వాత మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలను శనివారం వరకు అట్టహాసంగా నిర్వహించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పెళ్లిలో హన్సిక ఎరుపు రంగు లెహెంగా, పొడవాటి ముక్కుపుడక, పెద్ద పాపిట బిళ్ల, ఒంటి నిండా ఆభరణాలు ధరించి పెళ్లి కూతురిగా ముస్తాబైంది. సోహైల్ పాలనురగ రంగు షేర్వానీ ధరించారు. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. హిందీ సీరియళ్లలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన హన్సిక ‘కోయీ మిల్ గయా’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు చిత్రాలు ‘దేశముదురు’, ‘కంత్రీ’, ‘మస్కా’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ‘మప్పిల్లై’, ‘ఎన్గెయుమ్ కాదల్’, ‘వేలాయుధమ్’, ‘సింగం 2’, ‘అరన్‌మనై’ సినిమాలతో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ సహా తమిళంలో తను నటిస్తున్న నాలుగు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వ్యాపారవేత్త అయిన సోహైల్‌కు ఇది రెండో వివాహం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!