‘సైంధవ్‌’ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌?

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published : 26 Mar 2023 02:18 IST

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ పాత్ర కోసం రుహానీ శర్మను ఎంపిక చేశారు. ఇప్పుడు మరో పాత్ర కోసం ‘జెర్సీ’ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ కథకు ఆమె పాత్రే కీలకంగా ఉండనున్నట్లు తెలిసింది. మూడో నాయిక ఎవరన్నది తేలనుంది. ఈ పాత్ర కోసం ఓ బాలీవుడ్‌ భామను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా వెంకటేష్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కూర్పు: గ్యారీ బీహెచ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని