Vishwak Sen: ‘విష్వక్‌..’ పేర్లు వినిపించాడు

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.

Updated : 30 Mar 2024 11:57 IST

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమాకి ‘మెకానిక్‌ రాకీ’ అనే పేరును ఖరారు చేశారు. శుక్రవారం విష్వక్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో రాకీగా విష్వక్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. ఇది ఆయనకు 10వ సినిమా. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతమందిస్తున్నారు. మనోజ్‌ కటసాని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.   

మరో చిత్రం.. ‘లైలా’

ప్రస్తుతం విష్వక్‌ సేన్‌ చేస్తున్న సినిమాల్లో రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కూడా ఉంది. దీన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘లైలా’ అనే ఆసక్తికర పేరును ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రచార చిత్రాన్ని బయటకొదిలారు. ఈ టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో విష్వక్‌ లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక విభిన్నమైన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. దీంట్లో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యముందని తెలిసింది. ఆ పాత్రను ఆకాంక్ష శర్మ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తనిష్క్‌ బాగ్చి సంగీతమందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని