Maruthi Nagar Subramanyam: మేడమ్‌ సార్‌.. మేడమ్‌ అంతే

రావు రమేశ్‌ కథానాయకుడిగా... లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 18 Apr 2024 12:03 IST

రావు రమేశ్‌ కథానాయకుడిగా... లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్‌ కీలక పాత్రలు పోషించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మాతలు. ‘మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండో గీతాన్ని బుధవారం విడుదల చేశారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటిపై చిత్రీకరించిన ఈ పాటని భాస్కరభట్ల రచించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. కల్యాణ్‌ నాయక్‌ స్వరపరిచారు. సినిమాలో రావు రమేశ్‌ తనయుడిగా, అల్లు అర్జున్‌కి వీరాభిమానిగా అంకిత్‌ కొయ్య కనిపిస్తారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి నటించారు. అల్లు అర్జున్‌ సినిమాల్లో హీరో పరిచయ సన్నివేశాల్ని ఊహించుకుంటూ పాడుకునే ప్రేమపాటగా ‘మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే...’ సాగుతుందని  సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని