Guntur Karam: గుంటూరు ఘాటు

పేరుకి తగ్గట్టే మా ‘గుంటూరు కారం’ చాలా ఘాటుగా ఉంటుందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

Updated : 10 Aug 2023 13:52 IST

పేరుకి తగ్గట్టే మా ‘గుంటూరు కారం’ చాలా ఘాటుగా ఉంటుందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న చిత్రమిది. బుధవారం మహేశ్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రచార చిత్రాల్ని విడుదల చేశాయి సినీవర్గాలు. వాటిలో మహేశ్‌ మాస్‌ అవతారంలో కనిపించడం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ‘‘అంచనాలకి దీటుగా చిత్రం రూపొందుతోంది. ఆగస్టు ద్వితీయార్ధం నుంచి చిత్రీకరణని పునః ప్రారంభిస్తాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని  చిత్రబృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని