bigg boss telugu 5: బిగ్‌బాస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అయిదో వారం హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయింది. ఈ వారం మొత్తం 9మంది నామినేషన్స్‌లో ఉండగా,

Published : 10 Oct 2021 21:43 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అయిదో వారం హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయింది. ఈ వారం మొత్తం 9మంది నామినేషన్స్‌లో ఉండగా, హమీదకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున తెలిపారు. ఈ వారం నామినేషన్స్‌లో షణ్ముఖ్‌ జస్వంత్‌, రవి, సన్నీ, విశ్వ, లోబో, మానస్‌, ప్రియ, హమీద ఉండగా.. చివరకు విశ్వ, హమీద మిగిలారు. ఈ సందర్భంగా ఒక బాక్స్‌లో చేయి పెట్టమని, ఎవరికైతే ఎరుపు రంగు చేతికి అంటుతుందో వాళ్లు ఎలిమినేట్‌ అయినట్లు అని నాగార్జున తెలిపారు. హమీద చేతికి ఎర్ర రంగు అంటడంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు.

దసరా సందర్భంగా ఆదివారం ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ షో అనేక ఈవెంట్లతో రసవత్తరంగా సాగింది. సినీ తారల డ్యాన్స్‌లతో పాటు, ఆది కామెడీ పంచ్‌లు అలరించాయి. హౌస్‌మేట్స్‌తో నాగార్జున ఆడించిన గేమ్స్‌ ఆకట్టుకున్నాయి. హౌస్‌మేట్స్‌ కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. ఇక ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ టీమ్‌ కార్యక్రమంలో సందడి చేసింది. అఖిల్‌, పూజాహెగ్డే.. షోకు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పూజాహెగ్డేను ఇంప్రెస్‌ చేసి మానస్‌ అవార్డు గెలుచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని