Suriya: అభిమానుల మృతి.. కుటుంబాలకు అండగా ఉంటానన్న హీరో సూర్య

సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఆయన అభిమానులు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా వారి కుటుంబాలను సూర్య పరామర్శించారు.

Updated : 24 Jul 2023 13:07 IST

పల్నాడు: ఇటీవల సూర్య (Suriya) పుటిన రోజు సందర్భంగా.. ఆయన అభిమానులు ఇద్దరు ఫ్లెక్సీలు కడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సూర్య.. మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్‌బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు హీరో సూర్య ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలను సూర్య వీడియో కాల్‌లో పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. మృతుల్లో ఒకరి సోదరి తాను డిగ్రీ చదివానని ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని సూర్య తెలిపారు. ఉద్యోగంతో పాటు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి..  వారిలో ధైర్యాన్ని నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని