
Imtiaz ali: నిజమే! అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు?
అందుకే రణ్‌బీర్-దీపికాను ఆ రంగు దుస్తుల్లో చూపించాం: ఇంతియాజ్ అలీ
ముంబయి: ‘అగర్ తుమ్ సాథ్ హో...!’ బాలీవుడ్ లవ్ సాంగ్స్‌లో ఇప్పటికీ టాప్ లిస్ట్‌లో ఉంటుంది. విడుదలై ఆరేళ్లైనా అందులో ఉండే కొత్తదనం, మెలోడీ ట్యూన్, అర్జిత్ సింగ్ గానం ఈ పాటను పదేపదే వినేలా చేస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ డ్రామా ‘తమాషా’లోనిదీ పాట. 2015లో విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ మంచి హిట్ సాధించింది. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రంలో ‘అగర్ తుమ్ సాథ్ హో’లో దాగిఉన్న ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ పాటలో రణ్‌బీర్-దీపిక ధరించిన దుస్తులు వారి హార్ట్, బ్రెయిన్‌ను ప్రతిబింబిచేలా ఉందంటూ తాజాగా ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ ఈపాటలో తారా(దీపిక) వెడ్ (రణ్‌బీర్) ఎరుపు రంగు, లేత రంగు దుస్తులు ధరించారు. దీని వెనుక ఓ ప్రధానకారణం ఉంది. ఇది వారి భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఎరుపు రంగు ‘హార్ట్’ గురించి చెబితే.. లైట్ రంగు ‘బ్రెయిన్’ గురించి తెలియజేస్తుందంటూ అంటూ ఆ పాటలోని అంతరార్థాన్ని వివరించాడు. ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇన్స్టాగ్రామ్ వేదికగా అంగీకరించారు. ‘‘అవును! అతడు చెప్పింది అక్షరాలా నిజం. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు. ఆ పాత్రలకు ఆ రంగు దుస్తులను మేం అందుకే ఎంపిక చేసుకున్నాం’’ అని బదులిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.