Vijay Deverakonda: ఆ కథపైనే కసరత్తులు
‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ ప్రణాళికలు మారిపోయాయి. కథలపై మళ్లీ కొత్తగా దృష్టి సారించారు. కొద్దిమంది హిందీ దర్శకులతోపాటు... తెలుగు దర్శకులు ఆయనకి కథలు వినిపించినట్టు తెలుస్తోంది.
‘లైగర్’ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రణాళికలు మారిపోయాయి. కథలపై మళ్లీ కొత్తగా దృష్టి సారించారు. కొద్దిమంది హిందీ దర్శకులతోపాటు... తెలుగు దర్శకులు ఆయనకి కథలు వినిపించినట్టు తెలుస్తోంది. వాళ్లలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో విజయ్ దేవరకొండకి కథ వినిపించారు. ఆ స్క్రిప్ట్‌పైనే ఇప్పుడు కసరత్తులు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘ఖుషి’ (Kushi) సినిమా సెట్స్‌పై ఉంది. కథానాయిక సమంత అనారోగ్యం నుంచి కోలుకున్నాక కొత్త షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఈలోపు విజయ్ కొత్త సినిమాని పట్టాలెక్కించే అవకాశాలున్నట్టు సమాచారం. ‘ఖుషి’తోపాటు కొత్త సినిమానీ సమాంతరంగా నడిపించే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.