Kiara Advani: థియేటర్‌లో.. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసిన కియారా- కార్తిక్‌.. వీడియో వైరల్‌

కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan), కియారా అడ్వాణీ (Kiara Advani) జంటగా దర్శకుడు సమీర్‌ విద్వాన్స్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha). ప్రేక్షకుల స్పందన చూసేందుకు హీరోహీరోయిన్లు ఓ థియేటర్‌కి వెళ్లి, సందడి చేశారు.

Published : 03 Jul 2023 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం తెరపై ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు.. అందులోని హీరోహీరోయిన్లు ప్రత్యక్షమైతే..? ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారితో సెల్ఫీ తీసుకుంటే? ఆ జ్ఞాపకం ఎప్పటికీ మరిచిపోలేనిది. ముంబయి వాసులు కొందరు ఈ అనుభూతినే పొందారు. కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan), కియారా అడ్వాణీ (Kiara Advani) జంటగా దర్శకుడు సమీర్‌ విద్వాన్స్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha). ఈ రొమాంటిక్‌ డ్రామా మూవీ జూన్‌ 29న విడుదలై, మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూసేందుకు కియారా, కార్తిక్‌ ఆర్యన్‌ ముంబయిలోని ఓ థియేటర్‌కు కలిసి వెళ్లారు. సినిమా ప్రదర్శన మధ్యలో వెళ్లి ఆడియన్స్‌ని డిస్ట్రబ్‌ చేయకూడదనే ఉద్దేశంతో క్లైమాక్స్‌ సీన్‌లో లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సినిమా అయిపోవడంతో బయటకు వెళ్లేందుకు రెడీ అయిన ఆడియన్స్.. హీరోహీరోయిన్లను చూసి అవాక్కయ్యారు. అప్పటి వరకు తెరపై సందడి చేసిన వారిని ప్రత్యక్షంగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బియ్యారు. సినిమాని ఆస్వాదించిన వారంతా కుర్చీల్లోంచి లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ హీరోహీరోయిన్లను ప్రశంసించారు.

అనంతరం, ప్రేక్షకులు కియారాతో సెల్ఫీ దిగారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ప్రేక్షకులు నిల్చొని చప్పట్లు కొట్టినవేళ.. మ్యాజిక్ సృష్టించామనే విషయం మనకు తెలుస్తుంది.. జీవితాంతం నిలిచిపోయే క్షణాలివి. ‘సత్య ప్రేమ్‌ కీ కథ’ టీమ్‌ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని కియారా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ నటి సుపరిచితమే. ‘భరత్‌ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో మెరిశారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ (Ram Charan) సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని