Kiara Advani: పెళ్లి కబురు అప్పుడేనా?
సొగసులతో కవ్విస్తూ.. ఆకట్టుకునే నటన ప్రదర్శించడంలో కథానాయిక కియారా అడ్వాణీ ముందుంటుంది. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్,’ ‘ఇందూ కీ జవానీ’, ‘జుగ్‌జుగ్ జీయో’లలో అదే తీరుతో ప్రేక్షకులను చెక్కిలిగింతలు పెట్టింది.
సొగసులతో కవ్విస్తూ.. ఆకట్టుకునే నటన ప్రదర్శించడంలో కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) ముందుంటుంది. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్,’ ‘ఇందూ కీ జవానీ’, ‘జుగ్‌జుగ్ జీయో’లలో అదే తీరుతో ప్రేక్షకులను చెక్కిలిగింతలు పెట్టింది. తెరపై కవ్వించడంలోనే కాదు.. నిజ జీవితంలోనూ నేను చిలిపేనని నిరూపించుకుంటోంది కియారా. దానికి సాక్ష్యం ఆదివారం రోజున తను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో. ఈ నాలుగైదు సెకన్ల అతిచిన్న వీడియోక్లిప్‌లో పాలనురగలాంటి డ్రెస్ ధరించి, చిరునవ్వులు చిందిస్తూ.. సిగ్గుల మొగ్గైంది. దీనికి ‘రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేను. అతి త్వరలో డిసెంబరు 2న వెల్లడిస్తాను. అప్పటిదాకా ఎదురుచూస్తూ ఉండండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో (Sidharth Malhotra) పెళ్లి విషయాన్ని వెల్లడిస్తుందని ఒకరంటే.. తను నటించబోయే కొత్త సినిమా విషయం చెబుతుంది కాబోలు అని ఇంకొకరంటున్నారు. ప్రి-వెడ్డింగ్ వీడియోలు మనతో పంచుకుంటుందేమో అని ఇంకో నెటిజన్ అంచనా వేస్తున్నాడు. ఈ చిలిపి వీడియో వెనుక ఉన్న సంగతేంటో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే. కియారా.. విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన ‘గోవిందా నామ్ మేరా’ డిసెంబరు 16న విడుదలకు సిద్ధంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు