New Movies: కొత్త.. కొత్తగా

అజయ్‌, విర్తి వఘాని, ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్‌ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి  ఇటీవల

Updated : 08 Jan 2022 07:14 IST

జయ్‌, విర్తి వఘాని, ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్‌ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి  ఇటీవల విడుదల చేశారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. శేఖర్‌ చంద్ర సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: వెంకట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు