KTR: ఇదొక అవమానకరమైన చర్య: డీప్‌ఫేక్‌ వీడియోపై కేటీఆర్‌

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియోపై కేటీఆర్ స్పందించారు. ఇదొక అవమానకరమైన చర్య అన్నారు.

Published : 08 Nov 2023 13:37 IST

హైదరాబాద్‌: రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్‌ వీడియో అంశం గత కొన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ వేదికగా ఫేక్‌ వీడియోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు తారలు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తాజాగా స్పందించారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు.

‘‘రష్మిక మందన్నాకు ఎదురైన చేదు అనుభవం గురించి వార్తల ద్వారా నేను తెలుసుకున్నా. ఒక సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణం. ఇదొక అవమానకరమైన చర్య. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని మా రాష్ట్రంలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

Allu Arjun: చెప్పు వదిలేసినా వైరలవ్వడం మొదటిసారి చూశా: శ్రీవల్లీ పాటపై అమితాబ్‌ కామెంట్స్‌

అసలేం జరిగిందంటే: రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ఆదివారం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌మీడియా స్టార్‌ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. అందులో రష్మిక ముఖం పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అమితాబ్‌ బచ్చన్‌ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన మరువక ముందే కత్రినా కైఫ్‌ని టార్గెట్‌ చేసుకుని ఫేక్‌ ఫొటో క్రియేట్‌ చేశారు. ‘టైగర్‌ 3’లోని టవల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని ఆమె ఫొటోని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని