Family Star: ఫ్యామిలీ స్టార్‌ రాక ఆ రోజేనా?

విజయ్‌ దేవరకొండను ‘ఫ్యామిలీస్టార్‌’గా మారుస్తున్నారు దర్శకుడు పరశురామ్‌. ‘గీత గోవిందం’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Updated : 27 Jan 2024 11:14 IST

విజయ్‌ దేవరకొండను ‘ఫ్యామిలీస్టార్‌’గా మారుస్తున్నారు దర్శకుడు పరశురామ్‌. ‘గీత గోవిందం’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై చిత్ర బృందం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 20 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయనున్నారని ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: కె.యు.మోహనన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని