Liger: ‘లైగర్‌’ కోసం...

‘నటన పరంగా... మానసికంగా... శారీరకంగా... ఇలా అన్ని విధాలుగా సవాల్‌గా నిలిచిన పాత్ర ఇది. నానుంచి సర్వస్వం తీసుకున్న సినిమా ఇది’’ అంటూ ‘లైగర్‌’ సినిమా గురించి పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

Updated : 03 Jul 2022 06:50 IST

‘నటన పరంగా... మానసికంగా... శారీరకంగా... ఇలా అన్ని విధాలుగా సవాల్‌గా నిలిచిన పాత్ర ఇది. నానుంచి సర్వస్వం తీసుకున్న సినిమా ఇది’’ అంటూ ‘లైగర్‌’ (Liger) సినిమా గురించి పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. ఛార్మి, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌ స్వయంగా నిర్మించారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌(Mike Tyson) ఓ కీలక పాత్రని పోషించారు. చిత్రం ఆగస్టు 25న తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఓ లుక్‌ని విడుదల చేశారు. పుష్పగుచ్ఛం అడ్డుపెట్టుకుని తన శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అందులో కనిపిస్తున్నారు. ఆ లుక్‌ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని